నాగ శౌర్య – కేతిక శర్మ రొమాంటిక్ పోస్టర్‌..

43

టాలీవుడ్ హీరో నాగ శౌర్య – కేతిక శర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’. నాగ శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ – నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.

షూటింగ్ ముగించుకున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం.. ప్రతీ శుక్రవారం ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ఆ విధంగానే #LAKSHYASFRIDAY కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌లకి మంచి స్పందన రాగా.. ఇప్పుడు రిలీజ్‌ అయిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత కలిగిస్తోంది.