‘సవ్యసాచి’.. నాగచైతన్య !

226
Naga Chaitanya's Savyasaachi In Chandoo Mondeti Direction
- Advertisement -

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన నాగచైతన్య.. ఈ మధ్య కాలంలో చక్కగా రొమాంటిక్ కామెడీలూ చేస్తూ వచ్చాడు. ఇటీవల యుద్దం శరణం సినిమా ద్వారా మరోసారి డిఫరెంట్ సినిమాను ఎంచుకున్నాడు. ఇక చైతూ తన 15వ సినిమాను కూడా ప్రకటించేశాడు. ఈ సినిమాకు దర్శకుడు చందూ మొండేటి. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్’ ఘన విజయాన్ని సాధించింది. అప్పటి నుంచే వీళ్లు తమ కాంబినేషన్లో మరో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకి ‘సవ్యసాచి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి .. కొంతసేపటి క్రితం టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. రెండు బలమైన చేతులు పదునైన ఆయుధాలను ధరించివున్న పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. పాండవ మధ్యముడిగా చెప్పుకునే అర్జునుడు విలు విద్యలో నిష్ణాతుడు. చీకట్లో సైతం గురితప్పక బాణాన్ని సంధించే ఆయనకి ‘సవ్యసాచి’ అనే బిరుదు వుంది. అదే ఇప్పుడు చైతూ సినిమాకి టైటిల్ కావడం ఆసక్తిని రేకెత్తించే అంశం.

savyasachi look

నాగచైతన్య ప్రస్తుతం యుద్ధం శరణం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో సినిమాలోని నటీనటులను పరిచయం చేసిన చిత్రయూనిట్, ఈ నెల 31న టీజర్ ను రిలీజ్ చేసింది. చైతూ మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండటం విశేషం.

- Advertisement -