అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఒకటి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు కాగా మరోకటి చందు మెండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్వసాచి. సవ్వసాచి మూవీలో చైతుకు జోడిగా నిధి అగర్వాత హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక చైతూకి అక్క పాత్రలో కనపించనుంది.. ఇప్పటి వరకూ ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్టు సమాచారం .ఇంకో పది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవనుంది.
ఇక చైతూ చేస్తున్న మరో మూవీ శైలజారెడ్డి అల్లుడు. ఈసినిమాలో చైతూకి జోడిగా అనుఇమాన్యూఎల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. నాగచైతన్య కు అత్తగా రమ్మకృష్ణ నటిస్తుంది. ఈమూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తుంది. అయితే ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు చైతూ.
ఇక చైతూ చేస్తున్న ఈరెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. సవ్వసాచి సినిమా ఆగస్ట్ 17 వ తేదిన విడుదల చేయనున్నారు. నెల చివరలో ఆగస్టు 31వ తేదిన శైలజారెడ్డి అల్లుడు సినిమా విడుదల చేయనున్నారు. 15రోజుల గ్యాప్ లోనే చైతూ రెండు సినిమాలు విడుదలకానున్నాయి. ఆగస్టు నెల మొత్తం అక్కినేని ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. రెండు సినిమాలతో రానున్న చైతూ ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.