ప్రస్తుతం టాలీవుడ్ ప్రేమపక్షులు ఎవరైన ఉన్నారా అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సమంత నాగచైతన్యలే. ఈ జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం సమ్మర్‌లో జరగనుంది. అయితే వీరి ఎంగేజ్మ్‌మెంట్ జనవరి 29న అంటే ఈరోజు జరగబోతున్నట్లు రెండు మూడు రోజులుగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి గానీ అటూ సమంత నుండి గానీ మాత్రం ఈ విషయం గురించి సమాచారం లేదు.
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో ఒకటి ఇపుడు హాట్ టాపిక్ అయింది. సమంత సంతోషంగా గంతులేస్తున్న ఆ వీడియో చూసిన వారంతా ఎంగేజ్మెంట్ ఈరోజే అని అభిప్రాయపడుతున్నారు. తాను కోరుకున్న, మనసిచ్చివాడితోనే ఎంగేజ్మెంట్ జరుగుతుందని ఆ ఆనందాన్ని ఆపుకోలేకే సమంత ఈ వీడియో పోస్టు చేసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
నాగ చైతన్య,సమంతల నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్‌లో జరగనుందని . ఈ వివరాల్ని ఏవరికి తెలియకుండా రహస్యంగా ఉంచినట్లు ఫిల్మ్‌నగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే వీరి నిశ్చితార్థన్నికి పరిమిత సంఖ్య లో సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.