నాగ చైతన్య ‘లవ్‌స్టోరి’ ట్రైలర్‌ అదిరింది..

108
- Advertisement -

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌ రావు నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.

హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మనసును హత్తుకునేలా ఉన్నాయి. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య మధ్య తరగతి అబ్బాయి పాత్ర పోషించారు. బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉండే అమ్మాయిగా సాయి పల్లవి నటించారు.

‘లవ్‌స్టోరీ’లోని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘సారంగదరియా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ సి.హెచ్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్.

https://youtu.be/1yH_eOxpkwo
- Advertisement -