సెప్టెంబర్ 10న చైతూ…’లవ్‌స్టోరీ’

32
love story

ఎట్టకేలకు నాగచైతన్య మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ- సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం లవ్‌స్టోరి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

వాస్తవానికి ఏప్రిల్ లోనే రిలీజ్‌ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడింది. తొలుత ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగిన థియేటర్స్‌లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ కృతనిశ్చయంతో ఉండగా అంతా అనుకున్నట్లుగానే సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.