మహేష్‌ బాబు @ ‘శ్రీదేవి సోడా సెంటర్’

117
mahesh

సుధీర్ బాబు ,ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం‘శ్రీదేవి సోడా సెంటర్’.గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమాకి, కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, టీజర్, ట్రైలర్లకు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెల 27న సినిమా రిలీజ్ కానుండగా లైటింగ్ చేసే సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు, సోడా సెంటర్ నడిపే శ్రీదేవి పాత్రలో హీరోయిన్ ఆనంది సందడి చేయనున్నారు.

తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ ను సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్ . రేపు (ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు “శ్రీదేవి సోడా సెంటర్” థియేట్రికల్ ట్రైలర్‌ను మహేష్ ఆవిష్కరిస్తున్నారు.