దర్శకుడు మారుతి చిన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. రీసెంట్‌గా‘మహానుభావుడు’ సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ దర్శకుడు. మారుతి నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ‘బాబు బంగారం, ప్రేమమ్’ వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే అక్కినేని హీరోలంటే ప్రేమకథలకు పెట్టింది పేరని.. చైతూ కూడా ఇప్పటిదాకా మంచి ప్రేమకథలు చేశాడని.. తాను చైతూతో చేసేది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని మారుతి వెల్లడించాడు.
అయితే తాజాగా నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. నాగ చైతన్య అక్కినేని సరసన ‘అను ఇమ్మాన్యు యేల్’ నాయికగా నటిస్తున్నారు. ఈరోజు మంచిరోజు కావటంతో ఈ చిత్రం పూజ కార్య క్రమాలు నిర్వహించటం జరిగింది. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ చిత్రానికి సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దర్శకుడు మారుతి.