హైదరాబాద్ లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హైడ్రా నిర్మాణాలపై స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు, దర్శకుడు హరీశ్ శంకర్, నటి మధు శాలిని.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే అన్నారు మెగా బ్రదర్.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..
ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 1, 2024
ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్… పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది,అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.