ఏపీ మంత్రి నారా లోకేష్ పై సెటైర్ వేశారు మెగా బ్రదర్ నాగబాబు. మై ఛానల్ నా ఇష్టం పేరుతో యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగబాబు గతంలో ఓ బహిరంగసభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అవినీతి, బంధుప్రీతి, మతపిచ్చి,కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్న ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ పిల్లలు దేవుళ్లు చల్లని వారే. కళ్ల కపటం లేని కరుణమాయులే.’ అని చిన్నప్పుడు చదువుకున్నానని, అలానే లోకేష్‌బాబు వాస్తవాలను ఒప్పుకున్నారని చెప్పారు. మీ పార్టీ గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత నిజాయితీగా మాట్లాడే రాజకీయనాయకుడే లేడు. లోకేష్‌కు ఓ వేసుకుందాం’ అని నాగబాబు అభిమానులకు పిలుపునిచ్చారు.
తన యూ ట్యూబ్ చానల్ ద్వారా పొలిటికల్ అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటానని తెలిపారు నాగబాబు. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమేనని, పెద్దగా సిరీయస్‌గా స్పందించాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో బాలయ్య ఎవరో తెలియదంటూ యూ ట్యూబ్ వేదికగా బాంబు పేల్చిన నాగబాబు తాజాగా ఆయన అల్లుడు నారా లోకేశ్‌ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
https://youtu.be/1KHrN6Y0juc