నదియా…తెలుగుతోపాటు తమిళంలో గతంలో మంచి మంచి సినిమాలు చేసిన సీనియర్ నటిగా మంచి పేరును సంపాదించుకుంది. గతంలొ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం ఎంత పెద్ది హిట్టో తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అత్తగా నటించి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమాతో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం నదియా అల్లు అర్జున్ హీరోగా వక్కంతపు దర్శకుడిగా పరిచయమవుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో అల్లు అర్జున్‌కు తల్లిగా నటిస్తుంది. ఈ సినిమాలో నదియా పాత్రను డైరెక్టర్ ప్రత్యకించి డిజైన్ చేసినట్లు సమాచారం. నదియా కెరియర్లలోనే ఈ పాత్ర నిలిచిపోతుందని, ఈ సినిమాలో నదియా పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. గతంలో నదియా మిర్చి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నదియా పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా విడుదలక వరకు ఆగాల్సిందే. మే 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుంది.