టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న భామ నభా నటేష్. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ ఇస్మార్ట్ గాళ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ వైపు వరుస సినిమాలు మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్‌తో యూత్‌ని ఫిదా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభాషా…తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌తో అలరించింది. నభా అందాలను చూసి యూత్ ఫిదా అవుతున్నారు.
నబ్బా కన్నడలో (2015) ‘వజ్రకాయ’లో సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలవడంతో ఒక్కసారిగా నబ్బా కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చోటుసంపాదించింది. ఇక తెలుగులో సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నబా…తర్వాత రవిబాబు దర్శకత్వంలో అదుగో,రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్, రవితేజతో డిస్కో రాజాతో సినిమాలు చేసింది. ప్రస్తుతం నభా నటించిన మ్యాస్ట్రో విడుదలకు సిద్ధంగా ఉంది.