యాక్ష‌న్‌లోకి దిగిన ‘నారప్ప’..

505
Naarappa
- Advertisement -

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ తెరకెక్కుతోంది. ఈ ప్రస్తుతం ష్యూటింగ్‌ దశలో ఉంది. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

NAARAPPA

ఇందులో వెంకటేష్‌కు జంటగా ప్రియమణి నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ త‌మిళ‌నాడులోని కురుమ‌లైలో జ‌రుగుతున్నాయ‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఈ షెడ్యూల్ త‌ర్వాత టీం అనంత‌పురంకి వెళ్ల‌నుంది. మణిశర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -