అనుష్క ‘నిశ్శ‌బ్దం’గా వచ్చేది అప్పుడే..!

631
Anushka
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Nishabdam

స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్ర విడుద‌ల‌పై అభిమానుల్లో స‌స్పెన్స్ నెల‌కొంది.అయితే జ‌న‌వ‌రి 31 విడుద‌ల అవుతుంద‌ని అప్ప‌ట్లో అన్న‌ప్ప‌టికి, టెక్నిక‌ల్ స‌మ‌స్యల వ‌ల‌న చిత్రం వాయిదా ప‌డింది. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 2న తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

- Advertisement -