ఆర్.కె.బీచ్ లో “నా పేరు సూర్య ” సైకత శిల్పం..

480
Naa Peru Surya sand art at Vizag RK Beach
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”.

కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

 Naa Peru Surya sand art at Vizag RK Beach

విశాఖ‌ప‌ట్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియోష‌న్ త‌రుపున అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్బంగా వైజాగ్ ఆర్ కె బీచ్ లో వేసిన సైకత శిల్పం చూపరుల్ని విశేషం గా ఆకట్టుకునేలావుంది. 5 ఫీట్ ఎత్తు లో… 30 ఫీట్లలో తీర్చిదిద్దారు. ఈ సాండ్ ఆర్ట్ ని రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సైకత శిల్పి మానస్ శేషు ఆధ్వర్యంలో వేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు సైకత శిల్పాన్ని చూసి పండగ చేసుకుంటున్నారు. విశాఖ‌ప‌ట్నం ఆర్‌.కె బీచ్ కి వ‌స్తున్న సంద‌ర్శ‌కులు ఇప్పటికే సెల్ఫిలు దిగ‌టం విశేషం. ఇది అల్లు అర్జున్ కి అభిమానులు ఇస్తున్న అందమైన కానుక అని సైకత శిల్పి అన్నారు.

ఈ పుట్టిన‌రోజు(8-4-18) సందర్భంగా అభిమానులు ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని చేయ‌టం చాలా అభినందించాల్సిన విష‌యం అన్నారు. మరోవైపు ఈ నెల 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -