దేశం కోసం చస్తా..అర్జున్ ఎమోషన్‌

220
Naa Peru Surya Naa illu India First Impact
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య. న్యూఇయర్ కానుకగా టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. బన్నీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ సినిమాపై హైప్ తీసుకొచ్చాయి.

నువ్వు ఎవరు అనే డైలాగ్‌తో ఫస్ట్‌ ఇంపాక్ట్‌ ప్రారంభమైంది. ‘నేను సోల్జర్‌’ అని బన్ని సమాధానం ఇచ్చారు. ‘నీకు సూర్య అంటే సోల్జర్‌.. కానీ ప్రపంచానికి యాంగర్‌’ అని బొమన్‌ ఇరానీ అనడం అల్లు అర్జున్‌ పాత్రపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కడ నుంచి ఫస్ట్‌ ఇంపాక్ట్‌లో కనిపించిన ప్రతీ సన్నివేశం నిజంగా ఇంపాక్ట్‌ను తలపించింది. చివర్లో ఇలాగైతే చచ్చిపోతావురా అని రావు రమేశ్‌ అంటుంటే.. ‘చచ్చిపోతా గాడ్‌ఫాదర్‌. కానీ, ఇక్కడ కాదు, బోర్డర్‌కు వెళ్లి చచ్చిపోతాను’ అని బన్ని సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ సనసన అందాల భామ అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. 2018 ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ మూవీ కోసం బన్నీ తన మేకొవర్ పూర్తిగా మార్చుకున్నాడు.

- Advertisement -