జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్- తమన్నా జంటగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ‘నా నువ్వే’ సినిమా మే 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు చేసిన నందమూరి కల్యాణ్ రామ్.. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనపడటం, సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
అయితే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ‘నానువ్వే’ పోస్టర్స్‌తో కూడిన ట్రక్స్ ఏర్పాటు చేసింది. మజ్జిగ తాగండి.. రూ.30వేల ఫోన్ గెలుచుకోండి అంటూ ఓ వినూత్న ప్రచారం మొదలుపెట్టింది ‘నా నువ్వే’ చిత్రయూనిట్ . ఈ ట్రక్స్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సిటీల్లోని వీధి వీధి తిరుగుతూ చల్లని మజ్జిగను ఉచితంగా అందిస్తాయని ప్రకటించింది.
అంతేకాదు.. మజ్జిగ తాగి ఆ ట్రక్‌తో ఓ సెల్ఫీ దిగి చిత్రయూనిట్‌కి పంపిస్తే.. పంపిన వారిలో లక్కీ విన్నర్స్‌ని సెలెక్ట్ చేసి ఐదుగురికి వన్ ప్లస్ 5 మొబైల్ అందించనున్నారు. మరో 20 మందికి సినిమా టికెట్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటన జారీ చేశారు చిత్ర యూనిట్.