తన జీవితంలో పెట్లబుర్జు ఆసుపత్రికి ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ అన్నారు. గతంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.కోటి కేటాయించనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా పెట్లబుర్జు ఆసుపత్రికి తొలి విడుతగా రూ.50లక్షల మంజూరు పత్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ పి. మాలతికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ…తాను ఇచ్చిన హామీ మేరకు రూ. 50లక్షల మంజూరు పత్రాన్ని ఇచ్చానని..వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నిధులు విడుదల చేస్తానని అన్నారు. పెట్లబుర్జు ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లవేలల అండగా ఉంటానని అంతేకాదు తన మిత్రులు కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ…బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ తాను జన్మించిన ఆసుపత్రి అభివృద్ధి పట్ల చూపించిన ఆసక్తి మిగతా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి…