డిగ్రీ ప‌రీక్ష రాసిన న‌టి హేమ..!

131

సినీ న‌టి హేమ డిగ్రీ అర్హ‌త ప‌రీక్ష రాసింది… అదేంటి ఇప్పుడు ఆమె డిగ్రీ పరిక్షరాయడం ఏంటని ఆశ్చర్యపడకండి ఇది నిజం. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె.. అర్హత పరీక్షను ఆదివారం నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో రాశారు. ప‌రీక్ష పూర్తైన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన హేమ.. డిగ్రీ చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటున్నాను. హైద‌రాబాద్‌లో అయితే ఇబ్బంది అవుతుంద‌ని న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చిన ప‌రీక్ష రాస్తున్న‌ట్టు తెలపారు. ఎవరి కంటా పడకూడదని అనుకున్నా అని, అలా జరుగుతుందనే ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చానని ఆమె అన్నారు.

ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటూనే ఖాళీ స‌మ‌యంలో ప‌రీక్ష కోసం ప్రిపేర్ అయింది. నల్లగొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయ‌ని భావించిన హేమ న‌ల్గొండ‌లో ఉన్న త‌న బంధువుల ఇంట్లో ఉంటూ ప‌రీక్ష రాస్తుంది. అంతేగాక ఎవరైనా గుర్తు పడితే… ప్రశాంతంగా పరీక్ష రాయడం కష్టమవుతుందనే ఆలోచన కూడా నల్లగొండలో పరీక్ష రాయడానికి ఓ కారణమన్నారు.