మైనంపల్లి హనుమంతరావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బిఆర్‌ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా పార్టీ ద్వారా గుర్తింపు తెచ్చుకొని, తీర ఎన్నికల సమయానికి కుచల బుద్దితో కాంగ్రెస్ పక్షాన చేరరాయన. అయితే ఆయన పార్టీ విడడమే మేలని పార్టీ నేతలు నియోజిక కార్యకర్తలు భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి కారణంగా నియోజిక వర్గంలో కూడా అసంతుప్త నినాదాలు వినిపిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. .
మైనంపల్లి కాంగ్రెస్ లో చేరడాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారట. మైనంపల్లి అవకాశవాది అని.. అధికార బిఆర్‌ఎస్ పార్టీకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కాంగ్రెస్ లో కూడా ఆ తరహా రాజకీయాలు చేసే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు వాపోతున్నారట. ఇక మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వరాదని నియోజిక వర్గ కార్యకర్తలు వ్యతిరేకస్వరం వినిపిస్తున్నాట్లు తెలుస్తోంది. పార్టీలో నియోజిక వర్గ సీనియర్ నేతగా ఉన్న నందికంటి శ్రీధర్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ మైనంపల్లికి టికెట్ కేటాయిస్తే పార్టీకి తమ సపోర్ట్ ఉదందని కూడా నియోజికవర్గ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారట.
దీంతో హస్తం పార్టీ అయోమయంలో పడింది. ఒకవేళ నియోజిక వర్గ కార్యకర్తల కోర్టిక మేరకు నందికంటి శ్రీధర్ కు టికెట్ కేటాయిస్తే మైనంపల్లి హస్తం పార్టీపై ధిక్కార స్వరం వినిపించే అవకాశం ఉంది. దీంతో మల్కాజ్ గిరి టికెట్ విషయంతో తీవ్ర కన్ఫ్యూజన్ లో ఉన్నారట హస్తం నేతలు. ఇప్పటికే కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నారని, పార్టీనే నమ్ముకున్న నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చాలమంది కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ఇప్పుడు మైనంపల్లి విషయంలో కూడా ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడంతో స్క్రినింగ్ కమిటీకి టికెట్ల పంచాయతి తీవ్ర తలనొప్పిగా మారిందట. మరి పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు సాగుతుందో చూడాలి.
Also Read:చేపనూనె వాడితే ప్రమాదమా ?