అరెరే.. ఆ హీరో పెదవులు తాకాడట

28
- Advertisement -

బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ సన్నివేశంలో హీరో పెదవులు నా పెదవులకు తగిలాయి. ఆ హీరో కావాలని చేయలేదు. అనుకోకుండానే జరిగింది. ఆ రోజు నాకు అసౌకర్యంగా అనిపించింది. వాంతి కూడా చేసుకున్నాను. నోటిని వందసార్లు కడుక్కంటే బాగుండనిపించది’’ అని రవీనా టాండన్‌ పేర్కొన్నారు. అయితే, ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. ఐతే, ఆ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ ఉపేంద్ర అనే సినిమాలో కలిసి నటించారు.

అన్నట్టు రవీనా టాండన్‌ మరో క్రేజీ సినిమాలో నటించబోతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప‘ సినిమా దేశమంతటా ఎటువంటి క్రేజ్ ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ‘పుష్ప-2’ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మూవీలో రవీనా టాండన్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెరపై అల్లు అర్జున్, రవీనా టాండన్‌ సీన్లు అదిరిపోతాయని టాక్. రవీనా టాండన్‌ కేవలం నార్త్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సౌత్ లోనూ కేజీఫ్ 2 తోటి టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది.

ఇంతకీ, రవీనా టాండన్‌ పుష్ప 2లో నటించడానికి ఎంత రెమ్యునరషన్ తీసుకుంటుందో తెలుసా ?, ఆమె ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారని సమాచారం. సౌత్‌లో ఇంత తక్కువ నిడివి ఉన్న పాత్ర కోసం ఇన్ని కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న నటిగా రవీనా టాండన్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ లేడీ సూపర్ స్టార్ చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి.

Also Read:నో బెయిల్.. లోకేష్ జైలుకే?

- Advertisement -