- Advertisement -
మయన్మార్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది.ఇవాళ ఉదయం మిలటరీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ దేశ మిలటరీ ప్రకటించింది.
ఆ దేశ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు సైనిక తిరుగుబాటు జరగడం చర్చనీయాంశంగా మారగా ముందస్తుగా సైన్యం మొబైల్ సేవలను, ఇంటర్‌నెట్‌ను నిలిపివేసింది.
గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సైన్యం ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల కమిషన్ క్లీన్ చీట్ ఇవ్వగా ఇవాళ తిరుగుబాటు జెండా ఎగురవేసింది సైన్యం.
- Advertisement -