లగ్గం కారట మస్తుగుంది…ఎవరిదో తెలుసా!

592
marriage card
- Advertisement -

పెళ్లి కార్డు అనగానే మనకు గుర్తుకొచ్చేది..దేవతల బొమ్మలు,వధూవరులు, తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి ముహూర్తం, కల్యాణ మండపం వంటి వివరాలు. డబ్బున్న వారైతే పెళ్లి కార్డుతో ఏదైనా కానుక ఇస్తుంటారు. ఇటీవలె ఓ ధనవంతుడి ఇంట్లో పెళ్లికి పెళ్లి కార్డులో మందుబాటిల్,గ్లాస్,వాటర్,స్టఫ్ వంటి వాటిని ఇచ్చి వావ్ అని పించారు.

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే శుభలేఖ గురించి నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే అచ్చమైన తెలంగాణ యాసను ప్రతిబింబిస్తూ శుభలేఖను ప్రింట్ చేయించారు. పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక వంటి పదాలు వాడకుండా లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా వంటి పదాలతో వినూత్నంగా రూపొందించారు మై విలేజ్‌ షో ఆర్టిస్ట్ చంద్రమళి. ఇప్పుడీ కార్డు నెట్టింట్లో వైరల్‌గా మారగా అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు.

- Advertisement -