నూతన కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

132
kcr
- Advertisement -

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాన్ని చేపట్టారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్&బి శాఖ అధికారులతో మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా, పరిపాలన సులభతరం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని,అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారన్నారు.ఏదైనా పని నిమిత్తం ప్రజలు కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగకుండా…ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందకి తెచ్చేలా నూతన కలెక్టరేట్ భవన సముదాయాలు ఉండనున్నాయన్నారు.

ఈ సందర్భంగా 100% శాతం నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కలెక్టరేట్లను ఈనెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల మొదటి వారంలో సిద్దిపేట, నిజామాబాద్..రెండో వారంలో కామారెడ్డి,జగిత్యాల,సిరిసిల్ల…మూడో వారంలో వరంగల్, జనగాం,పెద్దపల్లి…నాలుగో వారంలో వికారాబాద్, మేడ్చల్..జిల్లాల నూతన కలెక్టరేట్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.

వచ్చే నెలలో నిర్మాణ పూర్తి దశలో ఉన్న మరికొన్ని కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు.వనపర్తి, మహబూబాబాద్,మెదక్,నాగర్ కర్నూల్,ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని క్షేతస్థాయిలో పర్యవేక్షించాలని ఈఎన్సీ గణపతి రెడ్డి ని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీ గణపతి రెడ్డి,ఎస్. ఈ లు,ఈ.ఈ లు,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్ అండ్ బి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -