నా గోత్రం ఇదే:రాహుల్

226
rahul gandhi
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో తప్ప మిగితా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్,బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నడూ లేని విధంగా రాహుల్ ఆలయాలకు వెళ్లడం,అక్కడి సంప్రదాయ పద్దతుల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుండగా ఆయన గోత్రమెంటో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ పుష్కర్‌లోని ఓ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ తన గోత్రాన్ని వెల్లడించారు. తాను బ్రహ్మణుడినని…తనది దత్తాత్రేయ గోత్రమని తెలిపారు.అనంతరంలో ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

గుజరాత్ ఎన్నికలు సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో రాహుల్ ఆలయాలను సందర్శించారు, తనను తాను శివభక్తుడిగా అభివర్ణించుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆలయాలకు వెళ్లడాన్ని బీజేపీ విమర్శించింది. ఈ నేపథ్యంలోనే తాన గోత్రాన్ని వెల్లడించారు రాహుల్.

- Advertisement -