నాయకులు కావాలనుకుంటే నా పార్టీలో చేరకండి..

219
- Advertisement -

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరులో ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ’ని ఏర్పాటు చేశారు. ప్రజలకు సేవ చేయడమే ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ’ లక్ష్యమని నాయకులు కావాలనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీలోకి రాకండి అంటూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపేంద్ర పేర్కొన్నారు. మైసూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేసేవారు మాత్రమే మా పార్టీలో చేరాలన్నారు.

My cashless party needs labourers, not leaders: Upendra
అయితే వాస్తవాలు మాట్లాడాలని ఇందులో థ్రిల్లింగ్‌, సస్పెన్స్‌ ఉండదని మీడియాకు వివరించారు. అభ్యర్థులు కావాలనుకునేవారు ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎటువంటి సేవలు చేశారనేది పరిశీలిస్తామన్నారు. వారి పనితీరు, ప్రజలకోసం పాటుపడిన విధానాలు పరిశీలించాకే టికెట్‌ ఖరారు చేస్తామన్నారు. ‘ఇప్పటివరకు నేను ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయించుకోలేదని, నా భార్య ప్రియాంక పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. సినిమారంగానికి చెందిన స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, సుదీప్‌, యశ్‌ల మద్దతు ప్రకటించారని వారు పార్టీలో చేరేది’ చెప్పలేదన్నారు.

- Advertisement -