కర్రసాము కోసం కష్టపడుతున్న సమంత‌..

273
- Advertisement -

సమంత అండ్ నాగ చైతన్య పెళ్లి తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. ముఖ్యంగా సమంత చాలా బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది. అయితే అమ్మడు మొదటి నుండి క్యూట్ పాత్రలనే ఎక్కువగా చేసింది. ఏ మాయ చేసావె దగ్గరి నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాలను చూసుకుంటే సింపుల్ అండ్ గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించింది. పూర్తిగా మాస్ లుక్ లో మాత్రం ఎక్కడా కనిపించలేదు.

Actress Samantha Doing Karra Samu

అలాంటి పాత్రలను చెయ్యాలని సమంతకి ఎప్పటి నుంచో కోరికగా ఉందట. కానీ అందుకు తగిన కథలు దొరకలేదు. అయితే ఇప్పుడు ఫుల్ మాస్ లుక్ లో కనిపించే అవకాశం దొరికే సరికి ఎలాగైనా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సమంత ప్రయత్నాలు చేస్తోంది. కోలీవుడ్ లో శివకార్తికేయన్ తో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో సమంత మాస్ లుక్ తో కనిపించడమే కాకుండా కర్రసాము విద్యను కూడా ప్రదర్శించడానికి రెడీ అవుతోంది. అందుకోసం స్పెషల్ గా శిక్షణ కూడా తీసుకుంటోందట.

సినిమాలో సమంత గెటప్ చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మొన్నటి వరకు కనిపించిన సమంత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కనిపించడం లేదని అంటున్నారు. ఈ క్యారెక్టర్ కొత్తగా ఉండడంతో సమంత కూడా చాలా జాగ్రత్తగా చేస్తోందని టాక్. మొత్తానికి సినిమాలో అన్ని పాత్రలను అమ్మడు డామినేట్ చేయడం పక్కా అనే టాక్ కూడా వినిపిస్తోంది.

https://youtu.be/4CU3PPHAJvo

- Advertisement -