రిలయన్స్ జియో ప్రస్తుత టెలికాం రంగానికి చుక్కలు చూపిస్తూ ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తోంది. కళ్లుమిరుమిట్లు గొలిపే జియో ఆఫర్లు చూసి ఇతర నెట్‌వర్క్ కస్టమర్లంతా జియో బాట పడుతున్నారు. జియో ఎఫెక్ట్ ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి.
జియో తన యాప్ లేదా సైట్‌లో పలు ప్లాన్లను రీచార్జి చేసుకున్న కస్టమర్లకు రూ.50విలువ గల 8 కూపన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కస్టమర్లు ఆ కూపన్లను తదుపరి చేసుకునే రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే అచ్చం ఇలాగే ఎయిర్‌టెల్ కూడా ఉచిత కూపన్లను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్నది.
మై ఎయిర్‌టెల్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఓఐఎస్ డివైస్‌లపై వాడుతున్న కస్టమర్లు యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. దీంతో ఆ యాప్‌లో చేసుకునే రూ.399, రూ.448 రీచార్జిలపై జియోలోలాగే రూ.50 విలువ గల ఉచిత కూపన్లు ఇస్తారు. వాటిని తరువాత చేసుకునే రూ.399, రూ.448 రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో కస్టమర్లు చేసుకునే రీచార్జి ప్లాన్‌లో రూ.50 మేర డిస్కౌంట్ లభిస్తుంది.
పైన చెప్పిన రెండు ప్లాన్లపై ఎయిర్‌టెల్ ప్రస్తుతం 100 క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లకు వోచర్ల రూపంలో అందిస్తున్నది. అంతేకాక యాప్ కొత్త అప్‌డేట్‌లో పేటీఎం వాలెట్‌ను ఇంటిగ్రేట్ చేశారు. దీంతో పేటీఎంను ఎయిర్‌టెల్ యాప్‌లో సులభంగా వాడుకోవచ్చు. ఇక పేటీఎంతో రీచార్జి చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.