- Advertisement -
హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ ఇకలేరు. నగరంలోని స్టార్ హాస్పిటల్లో సోమవారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గతంలో హైదరాబాద్ రంజీ క్రికెట్ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. బీసీసీఐ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
1988-1999 మధ్యకాలంలో ఆయన 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆయన మృతిపట్ల హైదరాబాద్, బీసీసీఐ క్రికెట్ పెద్దలు సంతాపం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు.
- Advertisement -