సెల్ఫీ ….చర్మానికి హాని..

217
- Advertisement -

సెల్ఫీ సరదా ప్రాణాలను బలిగొంటున్న ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సాంకేతిక విప్లవం ప్రయోజనకరంగా ఉన్నా.. వినియోగంలో మాత్రం పెడ ధోరణి కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొబైల్స్‌లో సెల్ఫీ ఆప్షన్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం తీసుకుంటున్న సెల్ఫీ ఫొటోలే వారి పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. సరదా కోసం ప్రమాదం అంచున ఫోటోకు పోజులు ఇస్తూ ప్రాణాలు కోల్పోయి కన్నవారిని, కట్టుకున్న వారిని, పిల్లలను తీరని దుఃఖంలో ముంచేస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.

  Did you know taking selfies can damage your skin and cause wrinkles ...

అయితే..సెల్ఫీలపై ఎక్కువగా మోజు పెంచుకుంటే అది అనారోగ్యానికి కూడా దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే కాంతి కిరణాలు, రేడియేషన్‌ వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బ్లాగర్లు, అతిగా సెల్ఫీలు దిగేవారు జాగ్రత్త వహించాలని తెలిపారు. స్క్రీన్‌ నుంచి వచ్చే నీలి రంగు కిరణాలు చర్మానికి హాని చేస్తాయని బ్రిటన్‌కు చెందిన లినియా స్కిన్‌ క్లినిక్‌ వైద్యుడు సైమన్‌ జోవాకే పేర్కొన్నారు.

చరవాణి నుంచి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు చర్మ కణాల్లోని డీఎన్‌ఏను నాశనం చేస్తాయని, ఫలితంగా ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ పెరిగి చర్మం ముడతలు పడుతుందని సైమన్‌ చెప్పారు

- Advertisement -