2024లో వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో చిత్రాలు ముందుకు వచ్చాయి. ప్రధానంగా టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకురాగా కొంతమంది హిట్ కొట్టారు..మరికొంతమంది నిరాశ పర్చారు. ఇక ఈ సంవత్సరం హిట్ కొట్టిన, ఫెయిల్యూర్ అయిన హీరోలు, సినిమాలను ఓ సారి పరిశీలిద్దాం.
టాలీవుడ్ సమరం అనగానే గుర్తుకొచ్చేది సంక్రాంతి సినిమాలు, ఈ సారి సంక్రాంతి రేసులో పలు సినిమాలు వచ్చినా భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలు రెండు. మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా గుంటూరు కారంలోని కుర్చి మడతపెట్టి సాంగ్ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
ఆ తర్వాత ఫిబ్రవరి 16న వచ్చిన ఊరు పేరు భైరవకొన, ఏప్రిల్ 5న వచ్చిన ఫ్యామిలీ స్టార్ పర్వాలేదనిపించాయి. చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ దాహాన్ని తీర్చింది ప్రభాస్ కల్కి 2898ఏడీ. జూన్ 27న వచ్చిన ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా ఈ సినిమా సెకండ్ పార్టు కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
జూలైలో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు పెద్ద డిజాస్టర్‌గా మిగలగా ఆగస్టు 9న వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆగస్టు 7న వచ్చిన 35 చిన్న కథ కాదు మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. అలాగే విక్రమ్ తంగాలన్ సైతం వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ అయింది. అలాగే సరిపోదా శనివారంతో నాని వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.
సెప్టెంబర్‌లో దేవరతో వచ్చిన కొరటాల శివ అదుర్స్ అనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మాస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించగా ఈ సినిమా సెకండ్ పార్టు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌లో రజనీకాంత్ వేట్టైయాన్, సుహాస్ జనక అయితే గనకతో మెప్పించారు. అలాగే అక్టోబర్ 14న వచ్చిన అమరన్ తో దుల్కర్ హిట్ కొట్టారు. అలాగే బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేసిన నెల ఇది అని చెప్పవచ్చు. దుల్కర్ సల్మన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పించారంటే ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2..డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:మనిషి జీవితం విస్తరాకు.. రెండు ఒకటే!