మస్క్‌ వర్సెస్ వెస్ట్రన్ కంట్రీస్‌..!

36
- Advertisement -

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ట్వీట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌ వెస్ట్రన్ కంట్రీస్‌ మధ్య మీని వార్ జరుగుతోంది. అయితే దీనికి రష్యా యొక్క దిమిత్రి మెద్వదేవ్ చేసిన ట్వీటే కారణం. పుతిన్‌కు అత్యంత సన్నిహీతుడు, రష్యా యొక్క డిప్యూటీ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్న దిమిత్రీ ఇటీవలే ఉక్రెయిన్‌ రష్యా ల మధ్య జరుగుతున్న యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. అయితే దిమిత్రీ ట్విట్టర్ వేదికగా ఈ భూమండలంలో ఉక్రెయిన్ అనే దేశం ఇక మీదట ఉండదు. ఉక్రెయిన్‌ వల్ల ఏ దేశానికి లాభం లేదు. రష్యా సార్వభౌమత్వం కోసమే ఈ యుద్ధం జరుగుతుంది. తప్ప ఎవరి కోసం కాదు. కానీ రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే…ఇక మీదట ఉక్రెయిన్‌ ఉండదు అని ట్వీట్టర్‌ పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల వెస్ట్రన్‌ కంట్రీస్‌ లాభం జరగదు. కానీ రష్యాను భయపెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో ఉక్రెయిన్‌కు భారీ మొత్తంలో ఆయుధాలను సమకూరుస్తోంది తప్ప ఈ విషయంలో వెస్ట్రన్స్‌కు ఎటువంటి ఆసక్తి లేదని దాన్ని సారాంశంగా చెప్పవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు పోస్ట్ కోవిడ్ తర్వాత ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి కానీ యుద్ధంను మాత్రం ఆపి చర్చలు దిశగా ఏ దేశం ప్రయత్నిస్తలేదని పేర్కోన్నారు. అంతేకాదు ఇందులో అమెరికా లాంటి దేశాలకు ఏటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి చర్చలు దిశగా ముందుడుగు వేసేలా ప్రోత్సహించదు అని అన్నారు.

దీనిపై వెస్ట్రన్ కంట్రీస్ ట్వీట్టర్ సీఈవోపై గుర్రుగా ఉన్నారు. దానిని వెంటనే ట్వీట్టర్‌ను తీసివేయాలని హూకుం కూడా జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనం. అయితే దీనికి బదులిస్తూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్చ ఉంది. పూర్తిస్థాయిలో తమ భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది కావున దానిని ట్వీట్టర్‌ నుంచి తొలగించడానికి నిరాకరించినట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి…

ఈడీ విచారణలో థర్డ్ డిగ్రీ: ఎంపీ సంజయ్

India Corona:40 వేలు దాటిన కరోనా కేసులు

మిసెస్ ఇండియాగా అంకితాఠాకూర్‌

- Advertisement -