అంబానీపై మస్క్ మరోసారి విమర్శలు..

7
- Advertisement -

పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారాలకు రిలయన్స్ నిధులు అందించిన సంస్థ సహకరించిందని, రిలయన్స్‌తో సంబంధం ఉన్న ఓ కంపెనీ అధికార పార్టీకి భారీగా రాజకీయ విరాళాలు ఇచ్చిందని పేర్కొన్న మీడియా కథనాలను ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు. భారత్‌లో తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభం ఆలస్యమవుతున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మస్క్ షేర్ చేసిన పోస్టులో 2022లో అల్ జజీరా ప్రచురించిన ‘రిలయన్స్ నిధులతో నడిచే సంస్థ ఫేస్‌బుక్‌లో బీజేపీ ప్రచారాలకు ఎలా సహకరిస్తోంది?’ అనే శీర్షికతో ఉన్న కథనాన్ని పొందుపరిచారు. అలాగే, 2024లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన మరో కథనాన్ని కూడా షేర్ చేశారు. ఎన్నికల బాండ్ల ద్వారా రిలయన్స్‌తో సంబంధం ఉన్న క్విక్ సప్లై (Qwik Supply) సంస్థ బీజేపీకి రూ.385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఇవి మీడియా కథనాల్లో వచ్చిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై రిలయన్స్ బహిరంగంగా స్పందించలేదు.

ఈ పోస్టుకు కొన్ని గంటల ముందు కూడా మస్క్… ముఖేశ్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని అంబానీ’ అంటూ సంబోధిస్తూ, మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత్‌లో తన స్టార్‌లింక్ సేవలు అంబానీ సంస్థతో పోటీ పడేందుకు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు.

Also Read:మాజీ సీఎం విజయన్‌కు షాక్

- Advertisement -