స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుని సూపర్ సక్సెస్ అయ్యారు. ఐతే, ఆ తర్వాత కాలంలో చక్రికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనే సడెన్ గా చక్రి చనిపోయారు. చక్రి చనిపోయాక, ఆయన కుటుంబలో ఆస్తి పరమైన గొడవలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చక్రి భార్యకి చక్రి తల్లికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది క్లారిటీ లేదు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు. మహిత్ నారాయణ్ మాట్లాడుతూ .. “చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఆర్థిక పరమైన సమస్యలు లేవు. కానీ, చక్రి అన్నయ్య చనిపోయిన తర్వాత మాత్రం మేం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చక్రి అన్నయ్య ఆస్తులు కొన్ని ఆయన భార్యకే దక్కాయి. కానీ, ఆమె మాత్రం మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది. మా చక్రి అన్నయ్య ఆస్తులతో ఆమె తన సరదాలు తీర్చుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే, మహిత్ నారాయణ్ ఇంకా మాట్లాడుతూ.. “చక్రి అన్నయ్య కు సంబంధించిన మరికొన్ని ఆస్తులు ఇంకా కోర్టు కేసులో ఉన్నాయి. పెద్ద మనుషుల మధ్య సమస్య పరిష్కారం కాదని తెలిసి, మేము కూడా కోర్టుకు వెళ్లడానికే ప్రాధాన్యతను ఇచ్చాము. కొంతకాలం క్రితం వరకూ నాకు ఒక స్టూడియో అంటూ ఉండేది కాదు. అందువలన అవకాశాలు రాలేదు. ఇటీవలే చక్రి అన్నయ్య పేరుతో ఒక స్టూడియో పెట్టుకున్నాను .. ఇప్పుడు ఫరవాలేదు” అంటూ మహిత్ నారాయణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహిత్ నారాయణ్ చక్రి భార్య గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి..