మునుగోడు..కాంగ్రెస్ ఇంచార్జీలు వీరే

59
congress
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా తాజాగా మండలాల వారీగా ఇంచార్జీలను ప్రకటించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్​లో కాంగ్రెస్​ నేతలు సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, దామోదర్ రెడ్డి, అంజన్ కుమార్, ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు పాల్గొన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రేవంత్ రెడ్డి, బోసురాజు బుజ్జగించారు.

సెప్టెంబరు 18 నుంచి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతల ప్రచారం ఉంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. మునుగోడులో అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో బీజపీ, టీఆర్ఎస్ ఉన్నాయని చెప్పారు. ఈ ఇన్‌చార్జుల జాబితాలో రేవంత్‌ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ ఉన్నారు.

- Advertisement -