మునుగోడు.. మునిగేది ఎవరో?

186
trs
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. 3న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి మధ్య పోరు జరగనుంది.

ముఖ్యంగా అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా ఈ ఉప ఎన్నికలు నిలవగా విపరీతమైన డబ్బు, మద్యం పంపిణీ జరిగింది. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రూ. 6.80 కోట్ల న‌గ‌దు, 4500 లీట‌ర్ల మ‌ద్యం సీజ్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంట్లో ఓట్లను భట్టి అన్నిపార్టీలు రేటు డిసైడ్ చేశాయి. ఓటర్లు మాత్రం అన్ని పార్టీల నుండి అందినకాడికి తీసుకున్నారు. కొన్ని సందర్బాల్లో ఆయా పార్టీల నేతల ముందే కొంతమంది ఓటర్లు బేరసారాలకు దిగారు. అయితే ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మొత్తం 2,41,855 మంది ఓటర్లుండగా 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తూ ఏర్పాటుచేశారు. గడిచిన కొన్ని రోజులుగా ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు వార్డుల్లో హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. మంత్రుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వరకు తమ అభ్యర్థుల తరపున ప్రచార బరిలో దిగి విజయం కోసం ఊరూరా తిరిగారు. ప్రచారపర్వంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ మరింత హీట్ పెంచారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపి అడ్డంగా బుక్కైంది. మొత్తంగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో మునిగేదెవరో, గెలిచేదెవరోనన్నది 7న తెలియనుంది.

ఇవి కూడా చదవండి..

మోడీకి లక్ష పోస్టు కార్డులు..

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి

బండికి అధిష్టానం అక్షింతలు..

- Advertisement -