- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా టీఆర్ఎస్‌కు 228 ఓట్లు, బీజేపీకి 224 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ-10కి ఇతరులకు-88 ఓట్లు వచ్చాయి.
ప్రస్తుం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 15రౌండ్‌లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుండగా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లన్నింటినీ లెక్కించనున్నారు. మొదటగా చౌటుప్పల్ మండలం ఓట్లను ఆ తర్వాత సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. ఇందులో ఒక్కో రౌండ్‌లో 21పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 21టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం..
- Advertisement -