సాయంత్రం 5గంటలకు పుర ప్రచారం ముగింపు

391
ecnagireddy
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 22న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుందని తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయకూడదని అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

సభలు, సమావేశాలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎన్నికలు జరుగు ప్రదేశంలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలకు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈనెల 25న ఈ ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -