భారత్‌ వేదికగా ఐఓసీ వార్షిక సమావేశం

55
olympics
- Advertisement -

ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వార్షిక సమావేశ ఆతిథ్య హక్కులను ముంబై దక్కించుకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఐఓసీ సమావేశానికి భారత్‌ ఆతిథ్యమిస్తోంది. సుదీర్ఘ విరామానంతరం భారతకు ఈ అవకాశం రావడం పట్ల జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌ మోహన్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

సమావేశ నిర్వహణ బిడ్‌ భారత్‌ దక్కించుకునేలా కృషి చేసిన ఐఓసీ సభ్యురాలు శ్రీమతి నీతు అంబానీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, భారత ఒలింపిక్‌ సంఘానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది వేసవి కాలంలో ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ (జిడబ్ల్యూసీ) సెంటర్‌లో జరగబోయే ఈ సమావేశంలో 150 మందికి పైగా ఐఓసీ ప్రతినిథులు పాల్గొనే అవకాశముందని వెల్లడించారు. ఐఓసీ నూతన కార్యవర్గం, సభ్యుల ఎంపిక, రాజ్యాంగ సవరణతో పాటు ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశ ఎంపికపై కూడా ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని జగన్‌ మోహన్‌రావు చెప్పారు.

- Advertisement -