న్యూఇయర్‌ టార్గెట్…1000 కోట్ల డ్రగ్స్ సీజ్

317
mumbai drugs seized
- Advertisement -

న్యూఇయర్‌ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకునేందుకు యావత్ దేశం రెడీ అవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా రకరకాల ఆఫర్లతో న్యూఇయర్‌ని క్యాష్‌ చేసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అయితే మందుబాబులు,డ్రగ్స్‌ సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా డ్రగ్ మాఫియాపై కొరడా విధించేందుకు స్పెషల్‌ ఫోకస్ పెట్టిన పోలీసులు రూ. 1000 కోట్ల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ముంబై శాంటా క్రూజ్ ప్రాంతంలో నిర్వహించిన దాడిలో 1,000 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మందులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారతదేశంలో నిషేధించబడిన ఫెంటాన్ల్ అనే డ్రగ్స్ ను ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్టు చేశారు.

అరెస్టన వారిని సలీం దోలా, ఘనశ్యాం సరోజ్, చంద్రమణి తివారీ, సందీప్ తివారీ అనే వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు వారికి 2019 జనవరి 1 వరకు కస్టడీకి అప్పగించింది.

ఫెంటాన్ల్ అనే మెడిసిన్..సాధారణంగా నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి మత్తుమందుగా వాడుతుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ఫెంటాన్ల్ మెడిసిన్ ధర రూ. 10 కోట్లకుపైగా పలుకుతోంది.

- Advertisement -