ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. ఆరంభంలో వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ఢిల్లీ సీజన్‌లో ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో సత్తాచాటి ముంబయిని చిత్తుగా ఓడించింది. జట్టులోని యువ ఆటగాళ్లు పాదరసంలా కదులుతూ.. చెన్నైపై విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ముంబయితో మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడారు.
175 పరుగుల లక్ష్య ఛేదనలోఢిల్లీ బౌలర్ల ముందు పోరాటపటిమ కనబర్చలేక మంచి బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా చేతులెత్తేసింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్ 3 బంతులు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ముంబైకి ప్లేఆఫ్ ఆశలు ఆవిరిపోయాయి. రిషబ్ పాంట్ 44 బంతుల్లో 64 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.