పాక్‎లో కృష్ణ ఆలయానికి రూ.2 కోట్ల నిధులు

180
20 Million Rupees Released To Renovate Krishna Temple In Pak
- Advertisement -

పాకిస్థాన్‎లోని హిందూ ఆలయం పునరుద్దరణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. హిందూవులు అత్యధికంగా ఉండే పంజాబ్ ప్రావిన్స్‎లోని పురాతన శ్రీకృష్ణుడి దేవాలయంను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు పాక్ ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేసింది. పాకిస్థాన్‎లో హిందూవులు పూజించే అతిపురాతన ఆలయం ఇది. పండగల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాలలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని పునరుద్దరించనున్నారు.

ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లో పూజలందుకుంటున్న ఏకైక హిందూ దేవాలయం కృష్ణ దేవాలయం మాత్రమే. ఈ ఆలయంలో రోజుకు రెండుసార్లు మాత్రమే ప్రార్థనలు చేస్తారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ప్రావిన్స్ చట్టసభ ప్రతినిధి అభ్యర్థన మేరకు దేవాలయం పునరుద్దరణకు నిధులు విడుదల చేసినట్లు ఈటీపీబీ డిప్యూటీ అడ్మినిస్టేటర్ మహ్మద్ ఆసీఫ్ తెలిపారు. త్వరలో పునరుద్దరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

- Advertisement -