ఐపీఎల్ 14వ సీజన్ వేలం ముగిసింది. అంతా ఉహించినట్లుగానే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ని సొంతం చేసుకుంది ముంబై. అర్జున్… ఫస్ట్ టైం ఐపీఎల్ వేలంలో పాల్గొనగా.. కొనుగోలు చేసేందుకు ముంబై ఆసక్తి చూపింది. కనీస ధర కింద రూ.20 లక్షలకు ముంబై అతన్ని సొంతం చేసుకుంది.
దేశీయ అన్ క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో అర్జున్ కు మాత్రమే చోటు దక్కింది. వేలానికి ముందు అర్జున్ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ చివరికి రూ.20 లక్షల కనీస ధరకే అర్జున్ ను ముంబై దక్కించుకుంది.
ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల ఎక్కువ ధర పలికి అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మోరిస్ ను అధిక ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గ్లెన్ మ్యాక్స్ వెల్ ను రూ. 14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిచర్డ్‌సన్ కనీస ధర రూ. 1.5 కోట్లు ఉండగా.. ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 14 కోట్లు ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది.