మోహన్ బాబుకు షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ

47
mohan babu

జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సినీ నటుడు,డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు షాకిచ్చారు. అనుమతి లేకుండా ఇంటి బయట ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఏర్పాటుచేసినందుకు భారీగా ఫైన్ విధించారు.

ముందస్తుగా ఎటువంటి రాత పూర్వక అనుమతి లేకుండా భారీ ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు లక్ష రూపాయల విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ హోర్డింగ్ బిల్డింగ్ ఫ్రంటేజ్‌కు 15 శాతం దాటిపోయిందని, పైగా అనుమతి తీసుకోలేదు కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’, మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాసి’ సినిమాలు చేస్తున్నారు.