కరోనా కట్టడిలో కేంద్రం విఫలం- మంత్రి ఈటల

205
Minister Eatala Rajender
- Advertisement -

కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది.అనేక సార్లు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో సూచించిన అనేక అంశాలపై ప్రభుత్వం స్పందించిందని రాష్ట్ర వైద్య రోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన కేంద్ర విధానంపై మీడియాతో మాట్లాడారు. ఏడాది నుండి కరోన కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంపై కొంతమంది కేంద్ర పెద్దలు చేస్తున్న ఆరోపణలు అర్థ రహితం. కేంద్రం ఇప్పటివరకు కరోన విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఏమీలేదని మంత్రి మండిపడ్డారు. వ్యాక్సిన్లు , ఇంజక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారు. కేంద్రం చేయాల్సిన తప్పులన్ని చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదు. కేంద్రం చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉంటే ఢిల్లీతో పాటు వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాదానం చెప్పాలన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోన కేసులు, మరణాలపై తప్పుడు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి తెలంగాణ పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 19 డయాగ్నోస్టిక్ సెంటర్లలలో వివిధ పరీక్షలను నిర్వహించేలా సీఎం ఆదేశించారు. 19 జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోన బాధితుల కోసం ఈ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులో కి తీసుకొచ్చింది. వచ్చేనెలలో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రన్ని కోరాము. రాష్ట్రలలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల కేంద్రమే బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి తెలిపారు.

తెలంగాణ 18 ఏళ్ళు పైబడిన యువకులు 1.7 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు రెండు డోసుల చొప్పున మూడు కోట్ల డోసులు అవసరం ఉన్నాయి. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచించాలి. రెమ్డిసివర్ ఇంజక్షన్‌పై కేంద్రం ఇష్టం వచ్చిన రేట్లు పెంచింది. మూడు వేల రూపాయలు ఉన్న ఇంజక్షన్ ముప్పై వేలకు అమ్ముతున్నారు దీనికి కారణం ఎవరు? దీనిపై కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ఫార్మా కంపెనీలతో కేంద్రం సమన్వయం చేసుకొని వ్యాక్సిన్ కొరత,ఇంజక్షన్ల ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రనిదే అన్నారు. రెమ్డిసివర్ ఇంజక్షన్ లను బ్లాక్‌లో ఇష్టం వచ్చినట్లు అమ్మినట్లు తెలిస్తే చర్యలు తప్పవు.

కోవిడ్ విజృంభిస్తున్న విషయాన్ని కేంద్రం అంచనా వేయడంలో విఫలం అయింది. అందుకే దేశ వ్యాప్తంగా ఎన్నికలు, కుంభమేళలు నిర్వహిస్తున్నారు. ముందుగానే సెకండ్ వేవ్ విషయంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వ్యాక్సిన్ ల కొరత , ఇంజక్షన్ ల సరఫరాలో కేంద్రనికి ముందుచూపు లేదు. టెస్టులు,వ్యాక్సిన్ ఒకే దగ్గర జరగకుండా ఉండేలా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాము. దీనివల్ల కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారని మంత్రి ఈటల వెల్లడించారు.

- Advertisement -