అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టండి- ఎన్నారై టీఆర్‌ఎస్

19
NRI TRS

లండన్:రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ మరియు ఖమ్మం కార్పోరేషన్స్‌తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టండని, ఎన్నారై టీ.ఆర్.ఎస్ యూకే అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మేలు జరిగిందని, ప్రజలంతా విజ్ఞతతో ఓటు వెయ్యాలని ప్రదీప్ కోరారు.

ఇటీవల ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించారని, ఎక్కడికక్కడ ప్రజలంతా ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలతో, వారి సమర్థవంతమైన పాలనతో సంతోషంగా ఉన్నట్టు తెలిపారని, మాకు అభ్యర్థులతో పని లేదని మా ఓటు కెసిఆర్ సార్ కు – కారు గుర్తుకేనని చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా భారీగా వ్యాప్తి చెందుతుంనందున ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే, మానసికంగా ఎంతో దైర్యంగా ఉండాలని, ఎలాంటి అపోహలను నమ్మకుండా డాక్టర్ సలహాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచి టీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.