రాణించిన ముంబయి.. ఢిల్లీ 110 పరుగులు..

88
dc

ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న పోరులో ముంబయి ఇండియన్స్ అన్ని రంగాల్లో తన సత్తా చూపుతోంది. మొదట ముంబయి బౌలర్లు ఢిల్లీ జట్టును 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులకే పరిమితం చేయగా…. ఆపై బ్యాట్స్ మెన్ తమ వంతు నిలకడ ప్రదర్శిస్తున్నారు. 111 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 41 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 24, డికాక్ 17 పరుగులతో ఆడుతున్నారు.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టును ముంబయి బౌలర్లు హడలెత్తించారు. ఢిల్లీ జట్టులో శ్రేయాస్ అయ్యర్ (25), పంత్ (21) ఓ మోస్తరుగా రాణించారు. బౌల్ట్ 3 వికెట్లు, బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీ లైనప్ ను ఓ ఆటాడుకున్నారు.