జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్..

94
C Parthasarathy

శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులతో స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ సీ. పార్థసారధి సమీక్ష నిర్వహించారు. సరైన సమయంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని అన్నారు. అయితే పాత రిజర్వేషన్లు అలాగే కొనసాగుతాయని ప్రభుత్వ నిర్ణయించిన మేరకు ఎన్నికల సంఘం ఎలెక్టోరల్ రోల్ తయారీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్‌ 7న జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో 9న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సమావేశం కానున్నారు. అదేవిధంగా 10వ తేదీన సర్కిల్‌ స్థాయిలో పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ల సమావేశం జరగనుంది. నవంబర్‌ 13న జీహెచ్‌ఎంసీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.