బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 18 హైలైట్స్

109
episode 18

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజవయంతంగా 18 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. మూడోవారం ఈ ఎపిసోడ్ వరకు సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్‌లకు ఉక్కు హృదయం టాస్క్‌తో అగ్గిరాజేశాడు బిగ్ బాస్‌. దీంతో ఇప్పటివరకు డల్‌గా సాగిన ఆట కాస్త రసవత్తరంగా మారింది.

మనుషుల టీంలో.. అఖిల్, మొనాల్, అమ్మా రాజశేఖర్, నోయల్, మొహబూబ్, దివి, సుజాత, సొహైల్‌లు ఉండగా రోబోల టీంలో అభిజిత్, దేవి, లాస్య, అవినాష్, కుమార్, గంగవ్వ, హారిక, అరియానా‌లు ఉన్నారు. ఇప్పటికే రోబోల టీంలో దేవి ఔట్ కావడంతో మనుషుల టీంలో ఒకర్ని కిడ్నాప్ చేస్తే మనం ఈజీగా చార్జింగ్ పెట్టొచ్చని ఐడియా ఇచ్చాడు అభిజిత్.

అయితే కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ చేసేందుకు అభిజిత్ వెళ్లినా పనికాకపోవడంతో రంగంలోకి దిగింది గంగవ్వ. అయితే గంగవ్వను ప్లాన్ చేసి ఇక్కడకు పంపించారని కనిపెట్టేయడంతో మళ్లీ అభిజిత్ బయటకు వెళ్లి.. బాత్ రూం అర్జెంట్‌గా ఉంటే ఎవరైనా రావొచ్చని చెప్పడంతో దివి వాష్ రూం కోసం లోపలికి వచ్చింది.

దీంతో దివిని కిడ్నాప్ చేశారు. దీంతో మనుషుల టీంకి దిమ్మతిరిగిపోయింది. ఆగ్రహంతో బిగ్ బాస్‌పై అరిచేశారు. నన్ను, రాజశేఖర్ మాస్టర్‌ని అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు గేమ్ ఎలా ఆడతారని సొహైల్ ఆవేశంతో ఊగిపోయాడు. తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు.ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకుని ఆట ఆడతావ్.. నీదీ ఓ బతుకేనా?? రారా బయటకు అంటూ అభిజిత్‌ని బండబూతులు తిడుతూ సొహైల్,మొహబూబ్‌లు కంట్రోల్ తప్పారు. మొనాల్ అయితే ఏడుపు ఆపుకోలేక డోర్ తీయండి బిగ్ బాస్ ప్లీజ్ అంటూ గట్టిగా అరిచింది. చివరికి అభిజిత్ వచ్చి డోర్ తీయడంతో మనుషుల టీం రచ్చరచ్చ చేశారు. అరియానా-సొహైల్‌లు ఒకరిని ఒకరు దూషించుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తర్వాత అరియానా గ్లోరీ సాహసం చేసి.. చార్జింగ్ పెట్టుకునేందుకు మనుషుల మధ్యకు వెళ్లింది. అయితే సొహైల్ ఆమెను గమనించడంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.