టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై..

64
MI vs PBKS
- Advertisement -

ఐపీఎల్‌లో భాగంగా బుధ‌వారం ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. పుణేలోని మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఎంసీఏ)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహ‌త్ శ‌ర్మ సేన‌.. పంజాబ్ కింగ్స్‌ను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక, ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రమణ్ దీప్ స్థానంలో టైమల్ మిల్స్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఇక, పంజాబ్ కింగ్స్ అదే టీమ్ తో బరిలోకి దిగుతోంది.

ఇప్ప‌టిదాకా ఈ సీజ‌న్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలోనూ ఓట‌మిపాలైంది. ఐపీఎల్ టైటిళ్ల‌ను అంద‌రి కంటే ఎక్కువ సార్లు చేజిక్కించుకున్న ముంబై.. ఇలా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో అభిమానుల‌ను నిరాశ‌ప‌రుస్తోంది. ఇక నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌.. రెండింటిలో విజయం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 7వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో అయినా ముంబై విజ‌యం సాధిస్తుందా చూడాలి.

తుది జట్లు

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, జై దేవ్ ఉనాద్కత్, టైమిల్ మిల్స్, బాసిల్ థంపి

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, జితేష్ శర్మ, షారూఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, కగిసో రబడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్

- Advertisement -